పూర్వకాలం బియ్యంకి బదులు చిరు ధాన్యాలను ఎక్కువగా ఉండేవారు.
ఈ చిరు ధాన్యాలతో పాటు నూకలను కూడా పెద్దలు ఆహారంగా ఉపయోగించేవారు.
వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియలో కొన్ని బియ్యం విరిగి చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి.
బియ్యాన్ని జల్లెడ పట్టినప్పుడు వెరైన బియ్యానే నూకలు అంటారు.
ప్రస్తుత కాలంలో నూకలను అన్నంగా వండుకుని తినే వారు చాలా తక్కువగా ఉన్నారు.
అయితే ఈ నూకలను వండుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అరుగుదల శక్తి తక్కువగా ఉన్న వారు, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉన్న వారు నూకలను అన్నంగా వండుకుని తినడం మంచిది.
నూకలను పలుచగా జావలా చేసి తాగడం వల్ల అజీర్తి, ఆకలి వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.
అనారోగ్యంగా ఉన్నప్పుడు అన్నం బదులుగా నూకలను జావగా చేసి కొద్దిగా పెరుగును కలిపి తాగించవచ్చు.
బియ్యం నూకలే కాకుండా గోధుమలు, ఇతరత్రా చిరు ధాన్యాల నూకలను కూడా జావగా చేసుకుని తాగవచ్చు.
చిన్న పిల్లలకు అన్నాన్ని మెత్తగా చేసి పెట్టడం కంటే నూకలతో వండిన అన్నాన్ని పెట్టడం మంచిది.
అలా చేయడం వల్ల త్వరగా జీర్ణమై అజీర్తి వల్ల కలిగే సమస్యలు రాకుండా ఉంటాయి.
నూకల అన్నాన్ని ఎక్కువగా నమిలే అవసరం ఉండదు కాబట్టి దంతాలు లేని పెద్దలకు ఆహారంగా ఇవ్వవచ్చు.
నూకలతో వండిన అన్నంలో నిల్వ పచళ్లను, వెన్నను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
నూకలను ఆహారంగా ఉపయోగించడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు.