ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి జీవితంలో ఒక భాగమైపోయాయి.

ఇంట్లో, ఆఫీసుల్లో, బయట ఇలా ఎక్కడికెళ్లినా ప్లాస్టిక్ బాటిల్స్ దే హవా.

అయితే ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీరు తాగడం వల్ల అనారోగ్యమని తెలిసినా తప్పదు.

మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అని అనుకునేవారు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

కొన్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో 3 లక్షలకు పైగా బాక్టీరియాలు ఉంటాయి.

కొన్నిటిలో 9 లక్షలకు పైగా బాక్టీరియాలు ఉంటాయి.

వీటిలో 90 శాతానికి పైగా హానికరమైన బాక్టీరియాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయినా గానీ వాటితో పెనవేసుకుపోయిన సంబంధం కారణంగా వాడకుండా ఉండలేము.

అయితే వాటిని తరచూ వేడి నీటితో శుభ్రం చేస్తూ ఉండాలి.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో వేడి నీరు పోసి, కొంచెం డిష్ వాష్ కలిపి బాటిల్ ని శుభ్రం చేసుకోవాలి.

పొడిగా ఉన్న వాటర్ బాటిల్ లో బియ్యం, సాల్ట్, బేకింగ్ సోడా వేసి 30 నిమిషాల పాటు ఉంచాలి.

ఇలా చేయడం వల్ల బాటిల్ లో ఉండే హానికర బాక్టీరియా నశిస్తుంది.

రాత్రి పడుకునే ముందు ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు, వెనిగర్ మిక్స్ చేసి రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత బాటిల్ ను శుభ్రపరచుకోవాలి.

ఈ చిట్కాలను తరచూ పాటిస్తే.. ప్లాస్టిక్ బాటిల్స్ లో బాక్టీరియా నశించడమే గాక వాసన కూడా రాకుండా ఉంటాయి.