మనదేశంలోని తొలి ఓటరుగా గుర్తింపు పొందిన శ్యామ్ శరణ్ నేగి  ప్రస్థానం ముగిసింది.

106 ఏళ్ల వయస్సులో అనారోగ్యం కారణంగా శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. 

శ్యామ్ శరణ్ నేగి 1917లో హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామంలో జన్మించారు. 

మొదటి సారి 1951లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి ఓటు వేసి.. తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 

ఆయన వృతిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 

1951లో తొలి ఓటు వినియోగించుకున్న ఆయన.. ఇప్పటి వరకు 16 సార్లు లోక్ సభకు వేటు వేశారు.

అన్ని ఎన్నికల్లో కలిపి ఇప్పటి వరకు ఆయన 34 సార్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇంతలోనే ఆయన మరణించారు. 

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నవంబరు 2న ఇంటి నుంచే తొలిసారి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేశారు. 

ఓటు వేసిన రెండు రోజుల తరువాత శనివారం ఉదయం కన్నుమూశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం గొప్ప పండగ అని నేగీ తరచూ అంటుండేవారు. 

ఆయన మృతి పట్ల  ఆ రాష్ట్ర సీఎం  జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు.

తాను తొలి సారి వేటు వేసే సమయంలో దేశంలో పరిస్థితుల గురించి శ్యామ్ శరణ్ నేగి చాలా సార్లు తెలియజేశారు.

ఆ రోజుల్లో కేవలం 30, 40 శాతం ఓటింగ్ జరిగితే గొప్పగా అనిపించేదని శ్యామ్ చెప్పారు. 

ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కని చెప్పి ప్రజలను చైతన్య పరిచాడు.

ఓటు వేయడం మన కర్తవ్యంగా భావించాలని అందరికి శ్యామ్ శరణ్ నేగి తెలియజేశారు