ఎండకాలంలో వేడిగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. కొందరికీ చల్లగా ఉన్నాసరే చెమటలు వస్తుంటాయి.

శరీరంలో చెమట పట్టడం సాధారణ ప్రక్రియ. వేసవిలో అయితే ఇది చాలా నార్మల్.

అయితే చెమట రావడం శరీరానికి చాలా అవసరం. ఇది బాడీలోని మురికిని తొలిగించడం సహా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

ఇకపోతే ఎక్కువగా చెమట పట్టడం కూడా పలు రోగాలకు కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి టైంలో వ్యాధి లక్షణాలు గుర్తించి, చికిత్స తీసుకోవడం, జీవనశైలిలో మార్పుల వల్ల దాన్ని నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.

ఎక్కువ చెమట పడుతుంటే అది మధుమేహానికి కారణమవుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. దీన్ని సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అంటారు.

ఇలాంటి సమస్యని ఫేస్ చేస్తున్నట్లయితే అది చాలా వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

షుగర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వ్యక్తి రక్తంలో తగినంత గ్లూకోజ్ ఉత్తత్పి కానప్పుడు డయాబెటిక్ హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది.

శరీరం, మెదడుకు శక్తినిచ్చేదే గ్లూకోజ్. బాడీలో అది తగినంత లేనప్పుడు శరీర వ్యవస్ధ సక్రమంగా పనిచేయదు.

అలాంటి వ్యక్తులు.. అలసట, చిరాకు, భ్రమ కలిగించే స్థితి తదితరు అనారోగ్య సమస్యల్ని ఫేస్ చేస్తారు.

ఎక్కువగా చెమట రావడం షుగర్ లక్షణం కాకపోయినప్పటికీ.. ఇతర కారణాలు దీనికి రీజన్ అయ్యే ఛాన్సులున్నాయి.

ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఫుడ్ ఎక్కువగా తినడం కూడా అధికంగా చెమట పట్టడానికి ప్రధాన కారణాలు.

అమ్మాయిలు మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా ఎక్కువ చెమటలు పడతాయి.

హైపర్ థైరాయిడిజం వ్యాధికి గురైన సందర్భాల్లో లుకేమియాతో బాధపడుతున్నప్పుడు, గుండె జబ్బులున్నప్పుడు విపరీతంగా చెమట పడుతుంది.