ఇప్పుడంటే సైకిల్‌ వాడకం తగ్గింది కానీ, ఒకప్పుడు అన్ని పనులకు సైకిల్‌నే వాడేవారు.

పదుల కిలో మీటర్ల దూరాన్ని కూడా అవలీలగా తొక్కుకుంటూ పోయేవారు. 

దీంతో వారి శరీరానికి అవసరమైన వ్యావామం అంది ఆరోగ్యంగా ఉండేవారు.

ఇక, ప్రతిరోజూ అరగంట అయినా సైకిల్ తొక్కడం వల్ల గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. 

స్లైక్లింగ్ అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగయపడుతుంది. 

దీంతో గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత రోగాల బెడద ఉండదు.

సైక్లింగ్ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

సైకిల్‌ తొక్కడం వల్ల తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి నడుము సైజు కూడా తగ్గుతుంది.

ముఖ్యంగా సైక్లింగ్ వల్ల కాళ్ల ఎముకలు బలంగా తయారవుతాయి. 

కానీ, ఇప్పడు సైకిల్‌లు అంతరించిపోతున్న పరిస్థితి ఉంది. 

ఎక్కడో.. ఎవరో ఒకరు సైకిల్‌ నడుపుతున్నారు. అలాంటి వాళ్లలో కీళ్ల నొప్పులు ఉన్న వారు అస్సలు సైకిల్‌ తొక్కకూడదు. 

ఇలా చేస్తే.. మొకాళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి.

ఊపిరి గట్టిగా పీల్చుకుని వదలటం కారణంగా ఆస్తమా ఎక్కువవుతుంది.