క్యారెట్ తొక్కలతో ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేయవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ తొక్కలను చిప్స్ తయారీకి వాడటం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
క్యారెట్ తొక్కలను సూప్‌లో కూడా ఉపయోగించొచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి ఈ సూప్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ ప్రయోజనకరంగా ఉంటుంది.
శాండ్‌విచ్‌లు, రోల్స్ వంటి ఆహారాలపై క్యారెట్ పై తొక్కను గార్నిష్‌గా ఉపయోగించవచ్చు.
క్యారెట్ జ్యూసీ ఫ్లేవర్ కావాలనుకునేవారు పచ్చి తొక్కలనే వాడొచ్చు.
క్యారెట్ తొక్కలతో తియ్యటి క్యాండీ కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు వీటిని స్నాక్‌గా అందించవచ్చు.
క్యారెట్ తొక్కలను పోషకమైన స్టాక్‌గా ఉపయోగించవచ్చు.
క్యారెట్ పీల్‌లో అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది బెస్ట్ స్టాక్‌గా నిలుస్తుంది.
క్యారెట్ తొక్కలను ఎండబెట్టి పౌడర్‌గా చేయవచ్చు.
మనం ఈ క్యారెట్ తొక్కల పౌడర్ ను సూప్‌లు, కూరలు, సలాడ్‌లలో కూడా ఉపయోగించవచ్చు.
ఇలా మనం ఏమి ఉపయోగంలేదనుకునే క్యారెట్ తొక్కలతో అనేక లాభాలు ఉన్నాయి.