కోడిగుడ్డు చాలామంది తింటారు. కానీ ఉడకబెట్టిన, ఆమ్లెట్ వేసినా పెంకు మాత్రం పారేస్తారు.
ఇక చర్మ సంబంధిత వ్యాధులని దూరం చేయడంలో కోడిగుడ్డు పెంకు చాలా ఉపయోగపడుతుంది.
ఇది మీ చర్మాన్ని సహజంగా పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మృత చర్మాన్ని కూడా తొలిగిస్తుంది.
గుడ్డు పెంకుల్ని మెత్తగా పొడి చేస్తే.. దీనిని చాలా రకాలుగా ఉపయోగించొచ్చు.
గుడ్డు పెంకులతో బాగా మసి పట్టిన వంట సామాగ్రిని స్కైబ్ చేయడానికి యూజ్ చేయొచ్చు.
నత్రజని, భాస్వరం లాగా మొక్కలు పెరగడానికి కాల్షియం అవసరం. దీనికోసం గుడ్డు పెంకుల పొడిని ఉపయోగించొచ్చు.
పక్షులకు ఆహారంగా గుడ్డు పెంకులను ఉపయోగించొచ్చు. ఇందులోని కాల్షియం... పక్షులకు పోషకాలు అందజేయడంలో సహాయపడుతుంది.
పెంకుల పొడిని టూత్ పేస్టుగా ఉపయోగిస్తే చాలా మంచిది. ఇందుకోసం ఓ టీస్పూన్ పెంకుల పొడి, చిటికెడు బేకింగ్ సోడా, కాస్త కొబ్బరినూనె కలపాలి.