ఖరీదైన కారు కొన్న ఇమ్మానుయేల్‌!

జబర్దస్త్‌ ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ప్రతిభ ఉండి.. సరైన వేదిక, అవకాశాలు దొరక్క చీకట్లో ఉన్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది.

అలా జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్‌ ఇమ్మానుయేల్‌ కూడా ఉన్నాడు. 

పంచ్‌లతో కడుపుబ్బా నవ్వంచడమే కాక.. రీల్‌ మీద వర్షతో నడిపే లవ్‌ ట్రాక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

కామెడీ చేయడం కోసం తన మీద తానే జోకులు వేసుకునేందుకు కూడా రెడీ అవుతాడు.

ప్రస్తుతం జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జాతి రత్నాలు కూడా చేస్తున్నాడు ఇమ్మాన్యుయేల్‌. 

ఈ క్రమంలో తాజాగా ఖరీదైన కారు కొన్నాడు ఇమ్మానుయేల్‌. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

హ్యుందై వెన్యూ మైక్రో ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు ఇమ్మానుయేల్‌.

నా కల నిజమయ్యింది.. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అన్నాడు.

కారు విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది అని సమాచారం.

ఈ క్రమంలో 2017లో ‘పటాస్’ ప్రోగ్రామ్ తొలిసారి బుల్లితెర మీద కనిపించాడు.

ఆ షోలో తన టాలెంట్‌ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. జబర్దస్త్‌ అవకాశం వచ్చింది.

2019లో ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేలు ప్రారంభంలో వెంకీ మంకీస్ టీమ్‌లో చేశాడు. 

వర్షతో స్క్రీన్‌ మీద నడిపే లవ్‌ ట్రాక్‌కి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు.