జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం, వాల్ నట్స్ ఇవే మనకి తెలిసిన డ్రై ఫ్రూట్స్.

కానీ ఇవి కాకుండా ఇంకో డ్రై ఫ్రూట్ ఉంది. దాని పేరే చిల్గోజా. దీన్ని పైన్ నట్ అని కూడా పిలుస్తారు.   

ఈ చిల్గోజా గోధుమ రంగులో ఉండి, రెండున్నర సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.

ఈ పండు లోపల ఉండే విత్తనాల్ని డ్రై ఫ్రూట్స్ గా ఉపయోగిస్తారు. 

చిల్గోజా పండులో ఉండే విత్తనాలను బయటకు తీసి ఎండబెట్టడం వల్ల నల్లగా మారతాయి.

నల్లగా ఉన్న తొక్కని తీసేస్తే లోపల తెల్లని పదార్థం ఉంటుంది. అది తియ్యగా ఉంటుంది. 

జీడిపప్పు, బాదంపప్పు కంటే కూడా ఈ చిల్గోజా విత్తనాల వల్ల అధిక ఉపయోగాలు ఉన్నాయి. 

దీన్ని తినడం వల్ల బలహీనత పోయి శరీరం బలంగా తయారవుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. 

చలికాలంలో చిల్గోజా తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. 

5 నుంచి 10 గ్రాముల చిల్గోజా గింజలను పొడి చేసి, తేనెలో కలిపి తింటే దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలు దరి చేరవు.  

బలహీనంగా ఉన్న వారు రోజూ 5 నుంచి 6 చిల్గోజా గింజలను తింటే బలం వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  

చిల్గోజా నూనెను ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు దీని నూనెను రాసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.