ఇప్పుడున్న పరిస్థితిల్లో లక్షలు లక్షలు సంపాదించడం అనేది సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబ వ్యక్తులకి, పేదలకి చాలా కష్టంతో కూడుకున్న పని.

నెలకి ఒక 5వేలైనా పక్కన పెడితే.. ఆ డబ్బు కొన్ని సంవత్సరాలకి పెద్ద అమౌంట్ అవుతుంది కాబట్టి దాయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

కానీ 5 వేలు దాయడం అంటే మామూలు విషయమా? ఏదో ఒక 500 అంటే దాయచ్చు కానీ 5 వేలు దాటడానికి వచ్చే జీతమే తక్కువ.

దానికి తోడు పెరిగిపోయిన ఖర్చులు, కరెంటు బిల్లులు, ఇంటి రెంట్లు, అప్పులు, వడ్డీలు, లోన్ ఈఎంఐలు ఇలా చాలా ఉంటాయి.

వీటి కోసం డబ్బు పక్కన పెట్టగా ఇంకా లోటు బడ్జెట్ లో ఉంటారు. ప్రస్తుతం దేశంలో అందరి పరిస్థితి ఇలానే ఉంది.

ఇదంతా కాదు కానీ ఒక 500, 1000 రూపాయలు దాస్తే భవిష్యత్తులో బాగా రెట్టింపు ఆదాయం వస్తుంది, అలాంటి స్కీం ఏదైనా ఉంటే చెప్పు అని అంటారా? అయితే ఈ స్కీం మీ కోసమే.

ఒక 500 రూపాయలు సినిమా చూసాం అనుకునో, లేదంటే ఇంకేదో ప్రాధాన్యత లేని అవసరం కోసం ఖర్చు పెట్టామనుకునో.. ప్రతి నెలా 500 పక్కన పెట్టండి. 11 ఏళ్లలో ఆ 500 రూపాయలు చేసే మ్యాజిక్ ఏంటో అర్ధమవుతుంది.

11 ఏళ్లలో 5 లక్షల రూపాయలని పొందుతారు. మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ రిస్క్ తో పెట్టుబడి పెడుతూ అధిక లాభాలను పొందే స్కీం ఒకటి ఉంది.

అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). ఈ ప్లాన్ లో ప్రతి నెలా కనీసం 500 రూపాయల చొప్పున 11 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే.. 11 ఏళ్ల తర్వాత 4,47,206 రూపాయల రాబడి వస్తుంది.

అంటే 11 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి 66,000 అయితే దాదాపు 7 రెట్లు అవుతుంది. 11 ఏళ్ల వ్యవధిలో 25 నుండి 30 శాతం వార్షిక రాబడి పొందవచ్చు.

అంటే 11 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి 66 వేలు, వచ్చే రాబడి 4,47,206 మొత్తం కలిపితే 5,13,206 రూపాయలు. 11 ఏళ్ల తర్వాత మీ చేతిలో 5 లక్షలు పైనే డబ్బు ఉంటుంది.

ఈ సిప్ లో మీరు వారానికొకసారి, నెలకొకసారి, 3 నెలలకొకసారి డబ్బు పెట్టుబడి పెడుతూ వెళ్ళచ్చు. అయితే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే 25 నుంచి 30 శాతం లాభాలను పొందే ప్లాన్ లు ఉన్నాయి.

ఏ ప్లాన్ అయినా దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితేనే అధిక లాభాలు ఉంటాయన్నది గుర్తించుకోవాలి.

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే, ఈ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తుని అందంగా మలచుకోండి. దీనిపై పూర్తి అవగాహన కోసం సమీప పోస్టాఫీస్, బ్యాంకులను సంప్రదించండి.