ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా చాలా సోషల్ మీడియా సంస్థలు ఉన్నాయి. మరి వీటిలో ఏది పెద్ద కంపెనీ తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ని సొంతం చేసుకున్నాడు.

చాలా కాలం నుంచి ఎలన్ మస్క్ కు, ట్విట్టర్ మధ్య డీల్ ఎపిసోడ్.. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగింది.

మొత్తానికి రీసెంట్ గా ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మరి సోషల్ మీడియా కంపెనీల్లో ఏది పెద్దది అంటే?

ప్రపంచవ్యాప్తంగా 2934 మిలియన్ల యూజర్లు ఫేస్ బుక్ లో ఉన్నారు.

రెగ్యులర్ గా మనం వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేసే యూట్యూబ్ లో 2515 మిలియన్ల యూజర్స్ ఉన్నారు.

నిద్రలేచింది మొదలు ఫోన్ లో నిత్యం యూజ్ చేసే వాట్సాప్ లో 2000 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

ఇక కొత్త ఫొటోలు, అప్డేట్స్ లాంటివి మనం రోజూ చూసే ఇన్ స్టాగ్రామ్ లో 1386 మిలియన్ల యూజర్స్ ఉన్నారు

ఇక మన దేశంలో బ్యాన్ అయినప్పటికీ మిగతా చోట్ల ఉపయోగంలో ఉన్న టిక్ టాక్ లో 1000 మిలియన్ల యూజర్స్ ఉన్నారు.

ఇక సినిమాలు, ఫొటోలు, వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ ని షేర్ చేసుకునే టెలిగ్రామ్ లో 700 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

ఇక లేచింది మొదలు స్నాప్ లు పెట్టే స్నాప్ చాట్ యాప్ లో 576 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

ఇక చైనాలో అందుబాటులో ఉండే QQ యాప్, వెబ్ పోర్టల్ లో 569 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

ఇక ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన ట్విట్టర్ లో 544 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

ఇక పింట్రెస్ట్ లోనూ 433 మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇందులో ఫొటోలు ఎక్కువగా లభ్యమవుతుంటాయి.

డేటా రిపోర్టల్ సంస్థ లెక్కల ప్రకారం.. అక్టోబరు నెల యాక్టివ్ యూజర్ల వివరాలు ఇవి.