వైవిధ్యభరితమైన కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం సర్దార్.
రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ: విజయ్ ప్రకాష్ (కార్తీ) పోలీస్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తుంటాడు. ఏదో ఒకటి చేసి మీడియాలో హైలైట్ అవ్వాలనుకునే స్వభావం విజయ్ ది.
ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఒక ఫైల్ మిస్ అవుతుంది. ఆ ఫైల్ లో సైనిక రహస్యాలు ఉన్నాయని తెలుసుకున్న సీబీఐ అండ్ రా ఏజెన్సీ ఆ ఫైల్ కోసం వెతకడం ప్రారంభిస్తాయి.
అది తెలిసిన ఇన్స్పెక్టర్ విజయ్.. మిస్ అయిన ఫైల్ ని పట్టుకుంటే మీడియా ముందు హైలైట్ అవ్వచ్చునని అనుకుంటాడు. ఫైల్ ని పట్టుకునే క్రమంలో విజయ్ కి.. తన తండ్రి సర్దార్ గురించి, అతని మిషన్ గురించి తెలుస్తుంది.
అసలు సర్దార్ మిషన్ ఏంటి? ఆ మిషన్ లో ఇన్స్పెక్టర్ విజయ్ పాలుపంచుకుంటాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.
సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు కొంచెం ఫస్ట్ హాఫ్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. కానీ మూవీ ఓవరాల్ గా అదిరిపోయిందని చెప్పవచ్చు.
ద్విపాత్రాభినయంలో కార్తీ పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో కార్తీ మాస్ లుక్ లో అదరగొట్టారు.
రాశి ఖన్నా, సిమ్రాన్, రజిషా విజయన్, చుంకీ పాండే, మురళీ శర్మ వంటి నటులు తమ పాత్ర మేరకు అద్భుతంగా నటించారు.
ప్లస్ పాయింట్స్: కథ, స్క్రీన్ ప్లే కార్తీ నటన సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్: తమిళ నేటివిటీ తాలూకు వాసన ఎక్కువ ఉండడం సెకండ్ హాఫ్ లో వేగం తగ్గడం
చివరి మాట: సర్దార్.. దుకాణం ఇప్పట్లో సర్దరు.. లాంగ్ రన్ పక్కా..