ఈ రోజుల్లో అమ్మాయిలు ఫంక్షన్ కు వెళ్లినా, పెళ్లికి వెళ్లినా, చివరికి కాలేజీకి వెళ్లినా కూడా తమ పెదాలకు లిప్ స్టిక్ వాడుతున్నారు.

గుంపులో మనం అందంగా కనిపించాలనే ఆశతో చాలా మంది అమ్మాయిలు అదే పనిగా అవసరం లేకున్నా పెదాలకు ఎక్కువ లిప్ స్టిక్ పెట్టుకుంటున్నారు.  

పెదాలకు ఎక్కువగా లిప్ స్టిక్ వాడడం వల్ల ఏరి కోరి ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనట. వినటానికి ఆశ్యర్యంగా ఉన్న ఇది నిజం. 

అమ్మాయిలు ఎక్కువగా లిప్ స్టిక్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని గతంలో ఓ అధ్యాయనంలో తేలింది.

 అసలు లిప్ స్టిక్ ఎక్కువగా వాడడం వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నేటి కాలంలో హీరోయిన్ ల దగ్గర నుంచి సామాన్య మహిళల వరకు ప్రతీ ఒక్కరు పెదాలకు లిప్ట్ స్టిక్ లేనిదే బయట అడుగు పెట్టడం లేదు.

అందరిలో నేను ప్రత్యేకంగా, అందంగా కనిపించాలని ప్రతీ అమ్మాయి పెదాలకు లిప్ స్టిక్ ను అతిగా ఉపయోగిస్తూ చివరికి సమస్యల బారిన పడుతున్నారు.

 అమ్మాయిలు పెదాలకు లిప్ స్టిక్ అధికంగా వాడడం వల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతాయట.

అమ్మాయిలు తరుచు పెదాలకు మోతాదుకు మించి లిప్ స్టిక్ పెట్టుకోవడం వల్ల మూత్రపిండాలు, పొట్ట బాగాలు కూడా దెబ్బతింటాయట.

లిప్ స్టిక్ లో ప్రమాదకరమైన మంగనీస్, లెడ్ కాడ్మియం వంటి రసాయనాలు ఉండడం వల్ల పెదలకు ఇవి హాని చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు లిప్ స్టిక్ వాడడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు హాని కలిగిస్తాయట. 

మహిళలు లిప్ స్టిక్ ఎక్కువగా వాడడం వల్ల కళ్లకు చిరాకును కలిగిస్తాయట.

అయితే మీరు ఖచ్చితంగా లిప్ స్టిక్ ను వాడాలని అనుకుంటే మాత్రం ముందుగా పెదాలను మాయిశ్చరైజ్ చేసుకోవాలట. 

మరీ ముఖ్యంగా డార్క్ కలర్ లో ఉండే  లిప్ స్టిక్ లకు మహిళలు కాస్త దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.