సూర్యగ్రహణం రోజున ప్రజలపై ప్రభావం ఉంటుందని, ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటారు.

అందుకే ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని చెబుతారు. ముఖ్యంగా గర్భిణీలు కొన్ని పనులు చేయకూడదని చెబుతారు.

గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు వెళ్ళకూడదట. 

సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్లు.. గర్భిణీ స్త్రీ యొక్క పిండాన్ని కప్పి ఉంచే చర్మం ద్వారా లోపలకి ప్రసరిస్తాయి. అవి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయి.

గ్రహణ సమయంలో సూర్యరశ్మికి గురైన మొక్కలు, పండ్లు తినకూడదు.

గ్రహణ సమయంలో చాకులు వంటి పదునైన ఆయుధాలు వాడకూడదు.

వీలైతే గ్రహణ సమయంలో వంట చేయడం, తినడం మానేస్తే మంచిదని అంటున్నారు. 

గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. 

గ్రహణ సమయంలో తులసి మొక్కని, జమ్మి చెట్టుని తాకకూడదు.

గ్రహణ సమయంలో సూర్య భగవానుడి మంత్రాలు జపిస్తే మంచిది.

మంత్రాలు జపిస్తే అదృష్టం, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. 

సూర్య గ్రహణ సమయంలో ధ్యానం చేస్తే ఉత్తమం. 

ఈసారి దీపావళి పండుగ నాడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 

అక్టోబర్ 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకూ గ్రహణం ఉంటుంది.

కాబట్టి ఈ సమయాల్లో చేయకూడని పనులు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.