క్రెడిట్‌ కార్డు.. చాలా మంది వీటిని వాడుతూనే ఉంటారు. వాటిపై విపరీతంగా షాపింగ్‌ కూడా చేస్తుంటారు. కానీ, అసలు క్రెడిట్‌ కార్డుల వల్ల ఎన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయో? 

అసలు క్రెడిట్‌ కార్డుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు.

నిజానికి క్రెడిట్‌ కార్డుల్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా షాపింగ్‌ చేసేవాళ్లకు సెపరేట్‌ ప్రయోజనాలతో కార్డులు, ట్రావెల్‌ చేసేవారికి ప్రత్యేకంగా ట్రావెల్‌ బెనిఫిట్స్‌ తో క్రెడిట్‌ కార్డులు ఉంటాయి.

అలాగే పెట్రోల్, డీజిల్‌ ఎక్కువగా ఉపయోగించే వారికోసం అదనపు ప్రయోజనాలు అందేలా ప్రత్యేకంగా క్రెడిట్‌ కార్డులు ఉంటాయి.

వాటిలోనూ భారత్‌ పెట్రోలియం కార్డులని, ఇండియన్‌ ఆయిల్‌ కార్డులని ఉంటాయి. అంటే ఆ క్రెడిట్‌ కార్డుతో ఆ బంకుల్లో మీరు ఆయిల్‌ కొనుగోలు చేస్తే మీకు అదనపు ప్రయోజనాలు దక్కుతాయి.

ఇప్పుడు యాక్సిస్‌ బ్యాంకు వారు ఇండియన్‌ ఆయిల్‌ క్రెడిట్‌ కార్డును మంజూరు చేస్తున్నారు. అయితే ఈ క్రెడిట్‌ కార్డుని వినియోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ కార్డు తీసుకునేందుకు రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది.

తర్వాత ఏడాదికి రూ.500 ఫీజుగా చెల్లించాలి. మీరు కార్డు పొందిన తర్వాత ఏడాదికి రూ.50 వేలకుపైగా కార్డుని వినియోగిస్తే.. మీరు కట్టాల్సిన ఇయర్లీ ఛార్జెస్‌ ని మాఫీ చేస్తారు. చాలా క్రెడిట్‌కార్డులు ఈ అవకాశాన్ని ఇస్తున్నాయి.

అయితే ఏడాదిలో వాడాల్సిన మొత్తం ఎంత అనేది ఆయా కంపెనీల షరతులకు లోబటి ఉంటుంది.

అయితే ఈ కార్డు ద్వారా చేసిన లావాదేవీలను మాత్రం ఈఎంఐగా మార్చుకోకండని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఆ ఈఎంఐలపై 49.36 శాతం వడ్డీ ఉంటుంది.

ఇంక ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా 53 లీటర్ల పెట్రోలు ఎలా ఉచితంగా వస్తుందో చూద్దాం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను యాక్సిస్‌ బ్యాంక్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

వాళ్ల వివరాల ప్రకారం.. సంవత్సరంలో మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ ఇండియన్ ఫ్యూయల్ కార్డు ద్వారా రూ.48 వేలు ఇండియన్‌ ఆయిల్ బంకుల్లో ఆయిల్ కొనుగోలు చేసి..

ఆన్‌లైన్‌ షాపింగ్ ద్వారా రూ.36 వేలు, మూవీ టికెటింగ్‌ కోసం రూ.6 వేలు, విడి అవసరాల కోసం రూ.54 వేలు ఇలా వివిధ రకాలుగా సంవత్సరానికి మీరు రూ.1.44 లక్షలు ఖర్చు చేస్తే.. క్యాష్‌ బ్యాక్స్‌, పాయింట్ల రూపంలో 3,718 పాయింట్లు లభిస్తాయి.

వాటితో మీరు ఫ్రీగా పెట్రోల్‌ కొనుగోలు చేయచ్చు. అయితే వాళ్లు లీటరు రూ.70 చొప్పున 53 లీటర్ల పెట్రోల్ వస్తుందని చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం.. 34 లీటర్ల వరకు పొందే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఫ్యూయల్‌ వినియోగించే వారు అయితే కచ్చితంగా ఈ కార్డు ఉపయుక్తంగా ఉంటుంది.