భారతీయులు తమ వంటల్లో ఇంగువను తరచుగా వాడుతుంటారు.

ఇంగువతో మంచి సువాసన, రుచి వస్తుందన్నది నిర్వివాదాంశం.

అయితే, ఇంగువ రుచి, సువాసనకే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. 

పిల్లలు తిన్న అన్నం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటే ఇంగువ వాడటం మంచిది.  

అజీర్తికి ఇంగువ మంచి వైద్యంలా పనిచేస్తుంది. 

ఇంగువలో కడుపు మంటను తగ్గించే గుణం, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి.

అరకప్పు నీటిలో కొన్ని ఇంగువ ముక్కలను కరిగించి తీసుకుంటే అజీర్తి, రుతు సమస్యలు దూరమవుతాయి.

ఊపిరితిత్తుల సంబంధ సమస్యలకు కూడా ఇంగువ చక్కటి ఓషధంగా పనిచేస్తుంది.

తేనె, అల్లంతో కూడిన ఇంగువను తీసుకుంటే పొడిదగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళాల వాపు, ఉబ్బసం వంటి సమస్యలు దూరమవుతాయి.

డయాబెటిస్‌కి కూడా ఇంగువ మంచి మందుల పనిచేస్తుంది. 

ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

ఇంగువలో ఉన్న కొమరిన్‌లు రక్తాన్ని పలుచగా చేసి, రక్తం గడ్డకట్టకుండా ఆపుతాయి.