పోస్టాఫీసు పొదుపు పథకాలు.. సిటీల్లో కంటే పల్లెటూరుల్లో వాళ్లు ఈ పొదుపు అవకాశాన్ని బాగా వినియోగించుకుంటూ ఉంటారు.
తక్కువ పొదుపుతో పరిమిత గడువు తర్వాత దానికి వడ్డీ జతచేసి కాస్త ఎక్కువ మొత్తాన్నే అందజేస్తున్నారు.
అయితే ఈ పొదుపు పథకాల్లో ఉండే ఇబ్బంది ఏంటంటే.. మీ ఖాతాలో ఎంత ఉంది? ఎన్ని నెలలు మీరు డబ్బు కట్టారు వంటి వివరాలను ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం ఉండదు.
పుస్తకంలో రాయడం, లేదా ప్రింట్ తీయడం ద్వారానే అవి మనకు తెలుస్తాయి. ఎప్పుడైనా అత్యవసరంగా కావాలి అంటే బ్యాంకుల మాదిరిగా డీటెయిల్స్ చూసుకోవడం సాధ్యం కాదు.
ఇ-పాస్ బుక్‌ని ఎలా ఉపయోగించాలి?
ఇ-పాస్ బుక్ సదుపాయంతో పోస్టాఫీసు పొదుపు పథకాలకు సంబంధించిన బ్యాలెన్స్ ఎంక్వైరీ మాత్రమే కాదు.. ప్రతి నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌కి చెందిన బ్యాలెన్స్ కూడా యూజర్లు చూసుకోవచ్చు.
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ స్కీమ్‌లకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్లను కూడా ఇ-పాస్‌బుక్ సదుపాయం ద్వారా మీరు చూసుకోవచ్చు.
మినీస్టేట్‌మెంట్‌లో మీరు రీసెంట్‌గా చేసిన 10 లావాదేవీలను మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
రానున్న రోజుల్లో ఫుల్ స్టేట్‌మెంట్‌ని కూడా చూసుకునే, డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఫలానా కాలానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ని కూడా వినియోగదారులు పొందే అవకాశాన్ని తీసుకురానున్నారు.