సాధారణంగా మనకు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. 

ఒక్కొక్కసారి ఏదో అందమైన పరిసరాలు కలలో వస్తూ ఉంటాయి

కొన్ని సార్లు అయితే ఏకంగా ధనవంతులు అయిపోయినట్లు కలలు వస్తుంటాయి. 

అప్పుడప్పుడు  పూలు కూడా కలలో కనబడుతూ ఉంటాయి. 

అలా ఎప్పుడైనా మీకు పూలు కలలో కనపడ్డాయా?

పూలు కలలో కనబడితే దానికి సంకేతం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

గులాబీ పూలు చాలా అందంగా ఉంటాయి ఎంతో మంది గులాబీలను ఇష్టపడతారు. 

గులాబీ పూలు  కలలో కనబడితే మీకు మరింత గౌరవం వస్తున్నట్లు అర్థం. 

 కలలో బంతిపూలు కనబడితే మీరు గొప్ప పుణ్యకార్యాలు చేయబోతున్నట్లు సంకేతం.

ఇక కలలో తామర పువ్వు కనబడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. 

ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ధనం వస్తుందని తామరపువ్వు సూచిస్తుంది.

మీ కలలో కనుక ఎండిపోయిన పూలు కనబడ్డాయంటే ఎవరితోనో గొడవ జరుగుతాయని సంకేతం. 

ఒకవేళ కనుక రంగురంగుల పూలు కనపడితే శుభవార్త వింటారు అని దానికి అర్థం.

అదృష్టం మీ జీవితంలోకి రాబోతోందని మల్లెపువ్వు సూచిస్తుంది.

ఇలా పూలు జీవితంలో జరగబోయే విషయాలను చెబుతాయి.