ల్యాప్ టాప్ ఉపయోగిస్తున్నామా లేదా అనేది కాదు.. సరిగ్గా యూజ్ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం.
ల్యాప్ టాప్ ని ఎలా పడితే అలా వాడితే ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు ల్యాప్ టాప్స్ ఎక్కడో ఓ చోట మాత్రమే కనిపించేవి. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తున్నాయి.
ఒక్క ఆఫీస్ వర్క్ కోసమే కాదు.. ల్యాప్ టాప్ చాలా విధాలుగా ఉపయోగపడుతోంది.
కొందరు టేబుల్ పై పెట్టి వర్క్ చేస్తే.. మరికొందరు పడుకుని ల్యాప్ టాప్ ని యూజ్ చేస్తుంటారు. బోర్లా పడుకుని కొందరు వాడుతుంటారు.
ఇలా ఎలా పడితే అలా కూర్చుని, పడుకుని ల్యాప్ ట్యాప్ యూజ్ చేస్తే అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి!
పడుకుని పొట్టపై ల్యాప్ టాప్ పెట్టుకుని పనిచేయడం వల్ల మెడనొప్పి ఎక్కువవుతుంది.
ఇదే పొజిషన్ లో గంటలు గంటలు ఉంటే అది వెన్నునొప్పికి కూడా దారితీస్తుంది.
ఇలానే ఏళ్ల నుంచి ల్యాప్ టాప్ వాడితే మాత్రం మహిళలకు గర్భాశయ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలా ఎప్పుడూ చేయొద్దు.
పొట్టపై ల్యాప్ టాప్ పెట్టుకుని పనిచేయడం వల్ల వెన్నెముక నొప్పి వస్తుంది. మీకు తెలుసో లేదో వెన్నుపాముకు ఏదైనా అయితే మీరు పూర్తిగా దివ్యాంగులు అయిపోతారు.
కడుపుపై ల్యాప్ టాప్ తో పనిచేయడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది.
దీని వల్ల మలబద్ధకం. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువవుతయి. ఆకలి కూడా ఎక్కువయ్యే అవకాశముంది. తద్వారా స్థూలకాయం వస్తుంది.
ఇదే పొజిషన్ లో ల్యాప్ టాప్ తో పనిచేయడం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
బ్లూ లైట్ నేరుగా పడుతుంది కాబట్టి చూపు తగ్గిపోతుంది. ఇది ఎక్కువైతే మీరు గుడ్డివారు అయిపోతారు.