రామ్ చరణ్ – డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ క్రేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకి ఆర్సీ15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది.
ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యహరిస్తున్నారు.
ఈ సినిమాలో మరోసారి కియారా అడ్వాణీ రామ్ చరణ్‌తో జత కట్టనుంది.
అంతేకాకుండా అంజలి, జయరాం, ఎస్‌జే సూర్యా, నవీన్ చంద్రలాంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సాయిమాధవ్ బుర్రా డైలాగులు అందిస్తున్నాడు.
ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఆర్సీ15 సినిమా మరో షెడ్యూల్ మొదలైపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమమహేంద్రవరం చుట్టుపక్కల షూటింగ్ నడుస్తోంది.
అందులో భాగంగా మారేడుమిల్లిలో సినిమా బృందం షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాకి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ చిత్రీకరణ సాగుతున్నట్లు చెబుతున్నారు.
మారేడుమిల్లిలో మొత్తం వారంపాటు షూట్ నడుస్తుందని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని..
ఇది రాజకీయ నేపథ్యం ఉన్న యాక్షన్ థ్రిల్లర్ అంటూ ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ లుక్, అంజలి లుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.