దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.

భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్నారంటూ వస్తున్న మెసేజుల పట్ల, రాంగ్ నంబర్ల నుంచే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరించింది.

డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల ప్లాన్స్‌తో జనాలను బురిడి కొట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో తమ ఖాతాదారులు ఇలాంటి మోసాల బారిన పడకుండా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎస్‌బీఐ ఈ సూచనలు చేసింది.

ఎస్‌బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్నారంటూ వస్తున్న మెసేజులు, కాల్స్ ను గుడ్డిగా నమ్మొద్దని, రాంగ్ నంబర్లను గుర్తించాలని ఎస్‌బీఐ తన ఖాతాదారులకు సూచించింది.

నంబర్లకు పొరపాటున కూడా కాల్ బ్యాక్ చేయవద్దని కోరింది. 

కస్టమర్ల వ్యక్తిగత లేదా ఫైనాన్సియల్ సమాచారం కోసమే సైబర్ మోసగాళ్లు మోసగాళ్లు ఇలాంటి కాల్ చేస్తుంటారని హెచ్చరించింది.

ఎస్‌బీఐ అఫీషియల్ ఐటీ నుంచి ఇలాంటి మెసేజులు, కాల్స్ కానీ రావనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంది.

మీకు వచ్చే సందేశాల్లో స్పెల్లింగ్ లేదా గ్రామాటికల్ తప్పిదాలు ఉంటాయని, వాటిని బట్టి రాంగ్ నంబర్‌గా అర్థం చేసుకోవచ్చునని వెల్లడించింది.

ఏదో ఒక నంబర్ నుంచి కాల్ చేసి అర్జెంట్‌గా స్పందించాలని కంగారు పెడుతుంటారని, అలాంటివాటిని నమ్మి వాళ్ళ మాయలో పడొద్దని తెలిపింది.