నా ప్రాణం ఖరీదెంతో నువ్వే చెప్పావుగా.. వదులుకుంటానా.. ఇక ఆట మొదలెడదామా!
నిన్ను పంపినవాడికి చెప్పు! నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను, రాజకీయం నా నుండి దూరం కాలేదు!
నిన్ను క్షమించడానికి నేను మహాత్ముడిని కాను.. అన్ని ఓర్చుకోడానికి పరమాత్ముడిని కాను..తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాధాసీదా మనిషిని!
నేను చాలా మంచివాడిని అని చెప్పను.. కానీ, చెడ్డవాడ్ని కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను!
నిజాయితీగా ఉండి పీకిందేంటి? రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది సమయం కాదు.. సమాజం!
ఇక్కడ బలహీనుడి నిజం కంటే.. బలవంతుడి అబద్దానికే విలువ ఎక్కువ! అందుకే నిజమెప్పుడు ఓడిపోతుంటుంది..
మనం కలవాలని.. మనకంటే ఎక్కువగా కోరుకున్న మనిషి ముందు మనం ఉన్నాం.. నాకు మిగిలున్న ఒకే ఒక బంధానివి నువ్వే!
తప్పుల్లో పెద్ద తప్పు ఏంటో తెలుసా! మంచి చేసినవారికి ఎందుకు ఆ మంచిచేశాం అనిపించేలా చేయడం..
ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే వారిని దొంగలంటారు.. మరి వాస్తవాలు దొంగిలించేవారిని ఏమనాలి.. న్యూస్ ఛానల్స్ అనాలా!
మీరు డీల్ చేసింది జయదేవ్ తో కాదు.. మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో.!
ఆపేసారేం.. మొరగండి! మీ అరాచకాలను భరించడానికి, మీ విధ్వంసాలకు బలవ్వడానికే కదా.. జనం మిమ్మల్ని ఎన్నుకుంది!
ఇన్నాళ్లు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, కొండా.. నేల.. మందు కాంట్రాక్టులు అంటూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రజల సొమ్ము తిని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు.. ఈరోజు నుండి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నాది!
తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి.. లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది!