రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటుంటారు. ఆపిల్ లో ఉండే పోషకాలు అట్లుంటాయ్ మరి.
అయితే ఆపిల్స్ ని బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ధమనుల్లో ఫలకం ఏర్పడితే కరోనరీ ఆర్టరీ (గుండె సంబంధిత) సమస్యకి దారి తీస్తుంది. ఆపిల్ తింటే ఆ దారిని మూసేసి.. ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా అడ్డుకుంటుంది.
తొక్కలోది తొక్కే కదా తీసి పడేయకండి. ఆపిల్ తొక్కలో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.
ఆపిల్ పండ్లను ఉదయం అల్పాహారంలో తింటే డయాబెటిస్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని, రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.
ఆపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫ్యాట్ ఉండదు. కాబట్టి ఊబకాయం, అధిక బరువు సమస్యలు ఉండవు.
ఆపిల్ లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది.
యాపిల్ లో శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి1, బి6, బి9 ఉంటాయి.
అలానే మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్, సోడియం, ఐరన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
వ్యాయామానికి ముందు ఒక ఆపిల్ తింటే స్టామినా పెరుగుతుంది. సామర్థ్యం పెరిగి ఎలాంటి అలసట, ఆయాసం లేకుండా వ్యాయామం చేయగలుగుతారు.
యాపిల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ నోట్లో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
రోజుకో యాపిల్ తింటే దంతక్షయం రాదు. నోరు బాగుంటుంది. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది.
కాబట్టి రోజుకో ఆపిల్ తినండి, రోగాలకి దూరంగా ఉండండి.