మరీ ముఖ్యంగా గర్భిణిలు ఎప్పుడు కూడా ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తారు.
ఇలా ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల.. పిండానికి, గర్భాశయానికి రక్తప్రవాహం కూడా పెరుగుతుంది.
అలానే గర్భంతో ఉన్న వారు నిటారుగా, వీపు మీద పడుకోకూడదు. ఇలా చేస్తే.. కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం.
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల మూత్రపిండాలకు, గర్భాశయానికి రక్తప్రవాహం సులభంగా అవుతుంది. అలానే వెన్ను నొప్పి నుంచి ఉపశమం లభిస్తుంది.
అలానే గర్భిణిలు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట తగ్గుతాయి. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు.
అలానే కాళ్ల మధ్యలో దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది.
అయితే ఒకే పొజిషన్‌లో ఎక్కువ సేపు పడుకోకూడదు అంటున్నారు నిపుణులు.