కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రముఖ నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా అదే పేరుతో దర్శకుడు మణిరత్నం సినిమా తీసిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎపిక్ పీరియడ్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
చోళ రాజ్యాన్ని పాలించే సుందరచోళ రాజు(ప్రకాష్ రాజ్)కు ఇద్దరు కొడుకులు ఆదిత్య కరకాలన్(విక్రమ్), అరుల్మోలివర్మన్(జయం రవి).. కూతురు కుందవై(త్రిష).
సుందరచోళ రాజు అనారోగ్యం పాలవ్వడంతో.. చోళ రాజ్య సింహాసనాన్ని పెద్ద కొడుకు ఆదిత్య కరకాలన్(విక్రమ్)కి అప్పగించాలని చూస్తుంటారు.
ఎప్పటినుండో చోళ రాజ్యాన్ని దక్కించుకోవాలని పలువేట్టరాయ(శరత్ కుమార్) పాండ్య వంశస్థులతో చేతులు కలిపి అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు
మరి శత్రు సైన్యం నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి యువరాజులు ఆదిత్య కరకాలన్, అరుల్మోలి వర్మన్, కుందవై ఏం చేశారు?
మధ్యలో నందినీ(ఐశ్వర్య రాయ్), వంధ్యదేవుడు(కార్తీ), సముద్రకుమారి(ఐశ్వర్యలక్ష్మీ)ల పాత్రలేంటి? ఆ తర్వాత చోళరాజ్యంలో ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
తెలుగు వాళ్లకు బాహుబలి, కన్నడ వాళ్లకు కేజీఎఫ్ లాగా తమిళం వారు పొన్నియన్ సెల్వన్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్నారు.
అదిగాక దర్శకుడు మణిరత్నం.. లైకా ప్రొడక్షన్స్.. స్టార్ కాస్ట్ ఉండేసరికి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా పాత్రలను పరిచయం చేస్తూ.. కథలో ఆయా పాత్రలకు ఎంతవరకు సంబంధం ఉంది అనేది క్లియర్ గా చెప్పేశాడు దర్శకుడు.
అద్భుతమైన విజువల్స్, మణిరత్నం టేకింగ్, సీన్స్ ని ఎలివేట్ చేసే ప్లీజెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అలా మెల్లగా కథలోకి తీసుకెళ్లారు.
ఇక సినిమాలో అందరు తమ తమ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించారు.
విక్రమ్, కార్తీ, ఐశ్వర్య, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్, జయరాం ఇలా అందరూ మెప్పించారు.
ఏఆర్ రెహమాన్ సాంగ్స్ పరవాలేదు.. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి.
ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఇది మరో బాహుబలి కాలేదు.. కానీ, మంచి కథగా అనిపించుకుంటుంది.