చాలామంది నాన్న కావాలని కోరుకుంటారు అవుతారు కూడా. 

కానీ మంచి నాన్న అవ్వాలంటే కొన్ని లక్షణాలు మీలో ఉండాలి.

నిజాయితీతో ఉండటం చాలా మంచి లక్షణం. అప్పుడే పిల్లలు కూడా నిజాయితీతో ఉంటారు.

సందర్భం ఎలాంటిది అయినా సరే తల్లిదండ్రులు సహనం అలవాటు చేసుకోవాలి.

ఇలా ఉంటేనే పిల్లలు సహనంగా ఉంటారు. లేకపోతే ఫ్రస్టేషన్ ఇరువురికి ఎక్కువైపోతుంది.

ఎప్పుడు బిజీ జీవితాన్ని గడపడం కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు సమయం కేటాయించాలి.

వీలు చూసుకుని పిల్లలతో చక్కగా ఆడుతూ ఉంటాలి. ఇలా చేస్తే పిల్లలు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు.

ప్రతి ఒక్కరికీ వాళ్ల బలం బలహీనత గురించి తెలియాలి.

అలానే ప్రతి తండ్రికీ కూడా వాళ్ల బలం బలహీనత ఏంటో తెలుసుకుంటే చాలా మంచిది.

ఇలా చేయడం వల్ల పిల్లలకు నచ్చేలా ఉండొచ్చు. ఇవన్నీ కూడా బెస్ట్ డాడీలో ఉండాల్సిన లక్షణాలు.