ధూమపానం, మద్యపానం అనారోగ్యానికి హానికరం.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ చాలామంది వీటిని మానలేకపోతున్నారు.
ఒక దానికి అలవాటు కానంతవరకే అది ఎంజాయ్ మెంట్.. బానిస అయితే మాత్రం దాన్నుంచి బయటకు రావడం చాలా కష్టం.
మార్కెట్లో నో ఎడిక్షన్ డ్రింక్, నో ఎడిక్షన్ స్మోకింగ్ అని ఏవేవో ఉన్నాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవి..
నాచురల్ గా ధూమపానం నుంచి దూరం కావాలనుకుంటే మిరియాలు చాలా ఉపయోగపడతాయి.
ఆహార రుచికే కాదు శరీరానికి, మనసుకు నల్ల మిరియాలు ఎంతో మేలు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ.
బరువు తగ్గడానికి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుపడటానికి నల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి.
కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ దూరం చేయడంలోనూ మిరియాలు చాలా కీలకం. 8.
ఆయుర్వేదంలోనూ నల్ల మిరియాలను వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని ఔషద గుణాలు పిల్లలు, పెద్దలకు ఎంతో మేలు చేస్తాయి.
నల్ల మిరియాల వాసన పీలిస్తే పొగ తాగలన్న కోరిక ఉండదని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. క్యాన్సర్ని నివారించే లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి.
తినే ఫుడ్ జీర్ణం కావాలన్నా, మల బద్దకం లేకుండా ఉండాలన్నా, గ్యాస్ సమస్యలు పోవాలన్నా సరే మిరియాల పొడి ఉపయోగించండి.
మగవాళ్లలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచి, పిల్లల పుట్టేందుకు నల్ల మిరియాలు ఉపకరిస్తాయి. వీటిలోని జింక్, మెగ్నీషియం సెక్స్ హార్మోన్లకు మేలు చేస్తాయి.
షుగర్ లెవెల్స్ కరెక్టుగా ఉండేలా, రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా నల్ల మిరియాలు పనిచేస్తాయి.