ప్రపంచంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైంది జోతిష్యం శాస్త్రం. అయితే కొంత మంది దీన్ని నమ్ముతారు.. మరికొంత మంది నమ్మరు.. ఎవరి ఇష్టం వారిది.

జోతిష్య శాస్ర్తంలో ముఖ్యమైనది వాస్తు శాస్ర్తం. వాస్తులో ఏదైన లోపాలు ఉంటే ఇబ్బందులు తప్పవు అంటున్నారు వాస్తు పండితులు.

అయితే ఇంట్లో చేసే చాలా చిన్న చిన్న తప్పుల వల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది.

ఈ సమస్యల పరిష్కారానికి వాస్తు ఫాలో అయితే చాలు అంటున్నారు వాస్తు నిపుణులు.

ఈ క్రమంలోనే దొసేలు వేసే పెనం వాడకం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు. 

వాస్తు నిపుణులు దొసె పెనాన్ని ఇలా వాడితే మీ ఇంట్లో సమస్యలు తప్పవు అంటున్నారు జోతిష్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలిపోయిన, సగం విరిగిపోయిన పెనాన్ని అస్సలే వినియోగించకూడదు. ఇలా పెనాన్ని వాడితే మీ ఇంట్లో సమస్యలు తిష్ట వేస్తాయని పండితులు చెబుతున్నారు.

ఇక ప్రతీ ఇంట్లో అందరూ చేసే పెద్ద తప్పు.. వంట చేసిన తర్వాత స్టౌ మీదే పెన్నాన్ని పెడతారు. 

ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆహార కొరత వస్తుంది అని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.

అదీ కాక ఇవ్వాల వాడిన పెన్నాన్ని.. మరుసటి రోజు కడకుండా కేవలం తుడిచే వాడతారు. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు.

అయితే వేడి వేడి పెనం మీద నీళ్లు జల్లకూడదట. దాని వల్ల భర్త జీవితంలో ఇబ్బందులు రావడమే కాకుండా.. కష్టాలు ప్రారంభం అవుతాయట.

మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే పెనం మీద కాస్త ఉప్పు వేస్తే మంచి ఫలితం ఉండి.. మీ సమస్యలు తొలగిపోతాయని పండితుల సూచన.

ఈ చిన్న చిన్న వాటిని మీరు జగ్రత్తగా పాటిస్తే మీ ఇంట్లో సమస్యలు అన్నీ తీరిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.