మన ఆరోగ్యాన్ని కాపాడే  నూనెల్లో  నీలగిరి తైలం ఒకటి.

నీలగిరి తైలాన్ని యూకలిప్టస్ ఆయిల్ అని కూడా పిలుస్తారు.

నీలగిరి తైలం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి.

ఈ తైలాన్ని పలు రకాల అనారోగ్య సమస్యలను  తగ్గించేందుకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

మ‌రి ఈ నీలగిరి తైలం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నీల‌గిరి తైలాన్ని వాస‌న చూస్తే చాలు మాన‌సిక ప్రశాంత‌ క‌లుగుతుంది.

నీల‌గిరి తైలం నుంచి వ‌చ్చే వాస‌న అరోమాథెర‌పీలా ప‌నిచేసి.. మ‌న‌కు క‌లిగే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను తగ్గిస్తుంది.

జట్టు ఒత్తుగా, దృఢంగా,ప్రకాశవంతగా ఉంచడంలో నీలగిరి తైలం ఉపయోగపడుతుంది.

జట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యల నివారించడంలో ఈ ఆయిల్ తోడ్పడుతుంది. 

నిత్యం మీరు వాడే పేస్టులో యూక‌లిప్టస్ ఆయిల్‌ను క‌లిపి దంతాల‌ను తోముకుంటే..వాటి సమస్యలు తొలగిపోతాయి.

జుట్టులో పేలు బాగా ఉన్నవారు నీల‌గిరి తైలాన్ని త‌ర‌చూ మర్దనా చేసి త‌ల‌స్నానం చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది.

ముక్కు దిబ్బడ‌, జ‌లుబు ఉన్నవారు ఈ తైలం వాస‌న చూస్తే చాలు ఆ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

విరేచ‌నాల స‌మ‌స్యతో బాధ‌ప‌డేవారి పొట్టపై కొద్దిగా యూక‌లిప్టస్ ఆయిల్‌ను రాస్తే ఫలితం ఉంటుంది.

పొట్ట చుట్టూ సున్నితంగా మ‌ర్దనా చేయాలి. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కీళ్లు, కండ‌రాల సమస్యలు ఉన్నవారు ఈ ఆయిల్ ను ఉపయోగిస్తే.. ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

నీల‌గిరి తైలంలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి.

దీని వలన శరీరంపై తగిలిన గాయాలు, దెబ్బలు, పుండ్లకు ఈ ఆయిల్ ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.