సమాజంలో ఆడవారిని తక్కువ చేసి చూస్తున్నారు. ముందు ఈ విధానం మారాలి.

ఆడ-మగ ఇద్దరూ సమానమే.. అన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి.

ఈ గుర్తింపు ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అందుకోసం చిన్నప్పటి నుంచే ఆడ కంటే మగ ఎక్కవ అనే భావన రాకుండా పిల్లల్ని పెంచాలి.

కానీ చాలా మంది ఇళ్లల్లో అమ్మాయిలకి ఆంక్షలు పెడుతూంటారు. అలా తిరగొద్దు.. ఇలా తిరగొద్దు.. ఈ టైమ్ కే ఇంటికి రావాలి.. అంటూ.

ఈ ఆంక్షలు మాత్రం అబ్బాయిల్లో కనిపించవు. ఈ సంప్రదాయం క్రీస్తూ పూర్వం నుంచే వస్తోంది.

అయితే ఈ క్రమంలోనే ప్రతి తల్లిదండ్రులు మగ పిల్లలకు కచ్చితంగా ఈ క్రింది విషయాల గురించి చెప్పాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మగ వారు స్త్రీల కంటే శారీరకంగానే బలంగా ఉంటారనే విషయాన్ని వారికి చిన్నతనంలోనే చెప్పాలి.

ఆడ పిల్ల కూడా మగవారితో సమానం అనే విషయాన్ని వారికి అర్దం అయ్యేలా చెప్పాలి.

ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా సాయం చేయాలి. ఈ అలవాటును చిన్నప్పటి నుంచే వారికి అలవాటు చేయాలి. 

 కొందరి మగ వారికి నేను మగ అనే అహంకారం ఉంటుంది. దాంతో అతడు కొందరిని గౌరవించడు. 

అలా కాకుండా వయసుతో, లింగ భేదం లేకుండా అందరిని గౌరవించాలని మీరు నేర్పించాలి.

సహజంగా మగ వారికి కోపం ఎక్కువగా. తన కోపమే తనకు శత్రువు అన్న విషయాన్ని చిన్నతనంలో వారికి తెలియజేయాలి.

ఎప్పుడూ నవ్వుతూ.. నవ్వించే వ్యక్తినే సమాజం ప్రేమిస్తుందనే విషయాన్ని మగ పిల్లలకు తెలియజేయాలి.