గతంలో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు ఎక్కువ. దీంతో ఒంట్లోని క్యాలరీలు కరిగి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు కూర్చున్నచోటే తినడం, తాగడం, పనిచేయడం లాంటివి చేస్తున్నారు
దీంతో శరీరంలో చాలా మార్పులొస్తున్నాయి. దీనివల్ల దుష్పరిణామాలు కూడా ఎక్కువే!
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎస్ ఆకారంలోని వెన్నెముక.. సీ ఆకారంలోకి మారుతుంది.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కంటిచూపు తగ్గడం, తలనొప్పి కూడా వస్తుంది.
కూర్చుని పనిచేసే వారిలో 54 శాతం మందికి గుండెపోటు వస్తుందని పరిశోధనలో తేలింది.
ఎక్కువ కూర్చోవడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్స్ వస్తాయి.
కాళ్లమీద కాళ్లు వేసుకోవడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. దీంతో వాపులు బయటకు కనిపిస్తాయి. దీన్ని వెరికోస్ వీన్స్ అంటారు.
కూర్చుని ఉద్యోగం చేసేవారికి స్థూలకాయం ఎక్కువగా వస్తుంది.
శారీరక శ్రమ లేకపోవడం, ఏసీల్లో పనిచేయడం, ఆకలి వేయకున్నా ఏదో ఒకటి లాగించేయడం, నిద్రలేమి దీనికి కారణాలు.
రోజూ కూర్చుని పనిచేసే వారి కండరాలు, ఎముకలు త్వరగా బలహీన పడతాయి. దీంతో ఆస్థియో పోరోసిస్ సమస్య వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. తిన్నది త్వరగా జీర్ణం కాదు.
జీర్ణం కాకపోతే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగిపోతాయి. అది టైప్ 2 డయాబెటిస్ కి దారితీస్తుంది.
శారీరక శ్రమ లేని ఉద్యోగం చేసేవారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే నిలబడం అలవాటు చేసుకోవాలి.
రాత్రిపూట పడుకునేటప్పుడు ఫోన్ కి దూరంగా ఉండాలి.
పనిచేసే సమయంలో ప్రతి గంటకు ఓసారి ఐదు నిమిషాలు లేచి నడవాలి.
రోజూ అరగంట వ్యాయామం, యోగ, ధ్యానం లాంటివి చేయాలి. అప్పుడే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.