సాధారణంగా హిందువులు పండగ వేళల్లో మాంసాహారం జోలికి వెళ్ళరు.
ఎందుకంటే పండగ పూటైనా ఆధ్యాత్మిక చింతనతో దైవ సన్నిధిలో గడపాలని అనుకుంటారు.
మాంసం, మసాలా పదార్థాలు వంటివి కోరికలను రగిలిస్తాయని మనకి తెలుసు.
ప్రతీ మనిషిలోనూ మూడు గుణాలు ఉంటాయి. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం.
సత్వగుణం చాలా పవిత్రమైన గుణం. మనిషికి క్షేమదాయకమైనది, ప్రశాంతతను కలిగిస్తుం
ది.
సత్వగుణం మనిషిని దైవం వైపు నడిపిస్తుంది. సత్వగుణం వల్ల జ్ఞానంపై ఆసక్తి పెరు
గుతుంది.
ఈ గుణంతో తలపెట్టిన కార్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
సత్వగుణంతో జీవించి మరణించిన వారు జ్ఞానులతో సమానం. అలాంటి వారు దైవ సన్నిధికి
చేరుకుంటారని విశ్వాసం.
ఇక రెండవది రజోగుణం. ఇది ఎక్కువగా ఉంటే ప్రశాంతంగా ఉండలేరు. ప్రాపంచిక భోగాల మ
ీద ఆసక్తి ఉంటుంది.
ఆలోచనలు, ఆందోళనలు వంటివి ఎక్కువ ఉంటాయి. సంతృప్తి అనేది ఉండదు. కోరికలను పెంచ
ి ఆత్మను ఈ జీవిత చక్రంలో బంధిస్తుంది.
తమోగుణం వల్ల అజ్ఞానం, మోహం, నిర్లక్ష్యం, సోమరితనం ఏర్పడతాయి.
మనం తీసుకునే ఆహరం బట్టే ఈ గుణాలు మారుతుంటాయి.
సాత్విక ఆహరం అంటే శాఖాహారం తీసుకుంటే సత్వగుణం కలుగుతుంది.
అన్ని రోజుల్లో కాకపోయినా పండగ రోజుల్లో అయినా సాత్విక ఆహరం తీసుకోవాలి.
ఉల్లిపాయ, వెల్లుల్లిని పండగ రోజుల్లో దూరం పెడితే మంచిది. మద్యపానం, ధూ
మపానం వల్ల రజోగుణం పెరిగిపోతుంది.