కూరలో అన్ని పదార్థాలు వేసినా రానీ టేస్ట్ ఉప్పు వేస్తే వస్తుంది. అందుకే "అన్నేసి చూడు.. నన్నేసి చూడు" అంటుంది అంట ఉప్పు.
ఇక ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. మనకు తెలిసిందల్లా తెల్ల ఉప్పు ఒకటే. కానీ ఉప్పులో పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ లాంటి రకాలు కూడా ఉంటాయి.
తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పు వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక దీని వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అవేంటో తెలుసుకుందాం.
పైత్యరసం ఉత్పత్తికి నల్ల ఉప్పు సహాయపడుతుంది. పైత్యరసం కాలేయానికి ముఖ్యమైంది. ఈ ఉప్పు శరీరంలో ఆమ్ల స్థాయిలను నియంత్రిస్తుంది.
మనకు ఒక్కోసారి కండరాలు తిమ్మిరి పడతాయి. దానికి కారణం పోటాషియం లోపం.
డయాబెటిస్ పేషంట్లు బ్లాక్ సాల్ట్ తీసుకంటే చాలా మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. అదీ కాక రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.
బరువు తగ్గడానికి బ్లాక్ సాల్ట్ ఒక ఔషధంగా ఉపయోగ పడుతుంది. ఇది బాడీలో వాటర్ నిలుపుదలను నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ సాల్ట్ లో నిమ్మరసం కలిపి తీసుకంటే మలబద్దకం తగ్గిపోతుంది. అలాగే కడుపులో ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
చర్మం పొడి బారటాన్ని, చర్మ పగుళ్లను బ్లాక్ సాల్ట్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. బాడీలో అలసటను నల్ల ఉప్పు దూరం చేస్తుంది.