పల్లీలు మానవ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.

తక్కువ ధరలో దొరికే మంచి ప్రొటీన్‌ ఆహారం కాబట్టి వీటిని పేద వాడి బాదం అంటుంటారు.

పల్లీల్లో పిండి పదార్థం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు, పైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. 

అయితే, పల్లీలు తింటే ఎంత లాభమో.. అతిగా తినటం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాలు ఏంటంటే.. 

ఐరన్‌, మాంగనీస్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు శోషణకు ఆటంకం కలిగిస్తాయి.

బరువు తగ్గడానికి ఇబ్బంది ఎదురవుతుంది. జీర్ణసమస్యలు వస్తాయి.

పల్లీల అలర్జీ ఉన్న వారు అస్సలు తినకూడదు. మరి కొన్ని రకాల అలర్జీలు ఉన్న వాళ్లు తీసుకుంటే..

గొంతు నొప్పి, చర్మ సమస్యలు, ముక్కు కారడం, జీర్ణ సమస్యలు, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి.

అందుకని తగిన మోతాదులో పల్లీలు తినటం మంచిది. 

మరి, రోజుకు ఎంత మోతాదులో పల్లీలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటారంటే.. రోజుకు 42 గ్రాములు అంటే రోజుకు 16 పల్లీ గింజలను మాత్రమే తినాలని.

మరికొంతమంది రోజుకు గుప్పెడు శెనగలు తింటే మంచిదని అంటుంటారు.