దేశంలో నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 9 రోజుల పాటు దుర్గాదేవీని నియమ నిష్ఠలతో.. ఎంతో పవిత్రంగా పూజిస్తారు.

ఇక పండగలు అనగానే మనకు మెుదటగా గుర్తుకు వచ్చేవి.. ఇంట్లో ఆడవాళ్లు చేసే ఉపవాసాలే!

అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ఉపవాసాలు చేస్తే పర్వాలేదు గానీ.. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లు చేస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు అంటున్నారు వైద్య నిపుణులు.

మరీ ముఖ్యంగా షుగర్ పేషంట్లు.. ఈ ఉపవాస దీక్షలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మీరు ఉపవాసం ఉంటారు కాబట్టి పప్పులు తీసుకోరు. వీటికి బదులు ఆహారంలో పనీర్, పాలు, చీజ్ లాంటి పదార్థాలు తినడం ఉత్తమం.

మీ ఆహారంలో పండ్లు, పండ్ల జ్యూస్ లాంటి పదార్థాలను చేర్చండి. అంతే కానీ బంగళాదుంపను మాత్రం తీసుకోకండి. బంగళాదుంపకు దూరంగా ఉండండి.

ఎలాగో ఉపవాసం ఉన్నాం కదా అని ఎడాపెడా కూల్ డ్రిక్స్ తాగకండి. అవి చెక్కెర స్థాయిలను పెంచే ప్రమాదం ఉంది. 

కూల్ డ్రిక్స్ కు బదులుగా బాడీలో నీటి సమతూల్యత కోసం నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి పానియాలను తీసుకోండి.

చాలా మంది ఈ రోజు ఉపవాసం కదా అని వ్యాయామ దిన చర్యను వాయిదా వేస్తారు. ఇది మంచి పద్దతి కాదు. ఉపవాసం రోజూ కూడా మీ దిన చర్యను కొనసాగించండి.

షుగర్ పేషంట్లకు తీపి పదార్థాలు విషంతో సమానం.

 అలా అని తినకుండా ఉండమని చెప్పట్లేదు. మీరు మీ కోరికలను పండ్లను తినడం ద్వారా తీర్చుకోవచ్చు.

ఉపవాసం ఉన్న షుగర్ పేషంట్లు పండ్లు తినడం ద్వారా శక్తి పొందడమే కాకుండా తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి