గర్భిణీలు ఎక్కువ సేపు హైహీల్స్ ను ధరించడం వల్ల కాలి కండరాలు ముందుకు వంగిపోతాయి.

ఈ కారణంగా ముందుకు వంగి ఉండాల్సి వస్తుంది. 

ప్రెగ్నెన్సీ టైంలో శరీర బరువు వేగంగా పెరుగుతుంది.  

అది శరీర భంగిమపై ప్రభావం చూపుతుంది. 

ఈ కారణంగా కాళ్ళ మడమలలో, వీపు నొప్పులు కలుగుతాయి. 

ఎక్కువ సేపు హైహీల్స్ తో నడవడం వల్ల పాదాలలో కండరాలు సంకోచిస్తాయి.

దీంతో కండరాలలో తిమ్మిరి కలుగుతుంది. 

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ తిమ్మిరి మరింత ఎక్కువవుతుంది.

హైహీల్స్ వల్ల బాడీ బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతాయి.

బరువు పెరగడం, హార్మోన్ల మార్పుల కారణంగా చీలమండలు వీక్ అవుతాయి. 

ఈ కారణంగా శరీర సమతుల్యత దెబ్బ తింటుంది.

దీని వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే.   

ప్రెగ్నెన్సీ సమయంలో చీలమండలు, పాదాలలో వాపు సాధారణం. 

అయితే హైహీల్స్, టైట్ షూస్ ధరించడం వల్ల ఈ సమస్య ఇంకా పెరుగుతుంది.

ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి గర్భిణీలు హైహీల్స్ వాడకపోవడమే మంచిది.