జీవిత భాగస్వామి తమని చాలా ప్రేమించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటరు. ప్రేమ కురిపించినా.. అది నిజమైన ప్రేమ అని చాలామంది గుర్తించట్లేదట.
మరి మీ పార్ట్ నర్ మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అయినా ఆ విషయం మీకు తెలియడానికి ఏమేం చేస్తారో తెలుసా?
ఎంత పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చినా సరే.. మీరు చెప్పే విషయాలు, సమస్యలు ఓపికగా వింటున్నారా.. అయితే మీపై పిచ్చి ప్రేమ ఉన్నట్లే!
ఎంత పెద్ద తప్పు చేసినా, దానిని ఇష్యూ చేయకుండా క్షమిస్తున్నారా.. అయితే మిమ్మల్ని పిచ్చిగా లవ్ చేస్తున్నారని అర్ధం.
మీ అభిరుచి మార్చుకున్నా, మీకు అనుగుణంగా మారుతూ, నచ్చినట్లు ప్రవరిస్తున్నారా.. వారికి మీపై చాలాప్రేమ ఉందనమాట.
సందర్భంతో పనిలేకుండా పూలు, బహుమతులు ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తున్నారా.. అయితే వారు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నట్లే.
మీపై ప్రేమని.. ప్రతి నిమిషం ఏదో రూపంలో బయటపెడుతూ మిమ్మల్ని సంతోషపరుస్తున్నారా.. అయితే మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారని అర్ధం.
మీ భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు, మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నారా.. అయితే మిమ్మల్ని వాళ్లు అమితంగా ప్రేమిస్తున్నట్లే.
మిమ్మల్ని మీ పార్ట్ నర్ నిజంగా ప్రేమిస్తే.. వారు మిమ్మల్ని పొందడానికి, మీ కుటుంబసభ్యులని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే వారికి మీపై ప్రేమ ఉన్నట్లే అర్ధం.