లవర్స్.. ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం చూసుంటారు. కానీ ఇక్కడ తన భర్తని, అతడు ప్రేమించిన అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేసిందో భార్య. ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
ఇది టిక్ టాక్ పరిచయాలతో మొదలై.. పెళ్లి వరకు వెళ్లి శుభం కార్డు పడిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ.
మేం చెబుతున్నది అబద్ధం అనుకుంటున్నారామే.. అస్సలు కాదు. ఓ భార్య దగ్గరుండి భర్తకి పెళ్లి చేసింది.
తిరుపతి డక్కిలి మండలంలోని అంబేడ్కర్ నగర్ లో ఈ ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది.
స్థానికంగా ఉండే ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేయడానికి అలవాటు పడ్డాడు.
అలా విశాఖపట్నంకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రేమకు దారితీసింది.
కొన్నాళ్లు చనువుగా ఉన్న వీరిద్దరూ.. ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల తర్వాత విడిపోయారు.
ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత.. అదే టిక్ టాక్ లో ఆ యువకుడికి మరో అమ్మాయి పరిచయమైంది.
అదే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి జీవితం ఆనందంగా ఉంది.
సదరు యువకుడిని చూసేందుకు విశాఖకు చెందిన అమ్మాయి నేరుగా తిరుపతి వచ్చేసింది.
అతడికి అప్పటికే పెళ్లయిపోయిందని తెలిసి.. అతడి భార్యతో మాట్లాడింది.
తాను ఇక్కడే ఉంటానని, ముగ్గురం కలిసుందామని ప్రియుడి భార్యని కోరింది.
అన్నీ ఆలోచించిన సదరు భార్య.. యువతి ఉండటానికి ఒప్పుకొంది. భర్తతో ఆమెకి పెళ్లి కూడా చేసింది.
తాజాగా జరిగిన ఈ పెళ్లి కోసం.. భార్య దగ్గరుండి భర్తతో పాటు అతడు ప్రియురాలికి ముస్తాబు చేసింది.