ప్రస్తుత మనలో చాలామంది ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇది చాలా సాధారణం అయిపోయింది.
అయితే ఆయిల్ ఫుడ్ తీసుకున్నా సరే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా
ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత హెవీగా ఉందని చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు.
ఆయిల్ ఫుడ్ తీసుకున్న తర్వాత అరగంట మెల్లిగా వాకింగ్ చేయండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది.
హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది.
ఆయిల్ పుడ్ తిన్న తర్వాత అస్సలు నిద్రపోవద్దు. లేదంటే జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
మనం ఆహారం తిన్న వెంటనే సరైన మోతాదులో నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది.
నీటిని తక్కువ తాగితే మాత్రం చిన్నప్రేగు, ఆహారంలోని నీటి శాతాన్ని జీర్ణక్రియకు ఉపయోగిస్తుంది. దీని వల్ల మలబద్ధకానిక
ి గురవుతాం.
ఈ మలబద్ధక సమస్య రాకూడదంటే.. తిన్న కాసేపటి తర్వాత ఎక్కువ మొత్తంలో నీరు తాగడం మంచింది.
ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత నీరు శాతం, ఫైబర్ అధికంగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతో మంచిది.
ఇలా పండ్లు.. మన శరీరంలోని వివిధ భాగాలకు విటమిన్లు, ఖనిజాలు అందించడంలో దోహదపడతాయి.
ఇలా ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవకుండా చూసుకోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి