మనసుకు నచ్చిన మనిషి దూరమైతే ఆ బాధ వర్ణించలేం. క్షణాలు యుగాలుగా గడుస్తాయి.

భార్య లేక భర్త విడాకులిచ్చారనో.. లవర్ బ్రేకప్ చెప్పిందనో చాలా మంది నిరాశకు లోనవుతూ ఉంటారు. ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని అనుకుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో మన మానసిక ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయకపోతే.. కష్టాలు తప్పవు అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

బ్రేకప్, విడాకుల తర్వాత మానసిక ఆరోగ్యం కోసం పాటించాల్సిన కొన్ని నియమాలను సూచించారు మెంటల్ హెల్త్ కౌన్సెలర్, ఎన్సో వెల్నెస్ వ్యవస్థాపకురాలు అరూబా కబీర్. అవి..

"గతం గతః"  బాబా సినిమాలో రజినీకాంత్ చెప్పిన డైలాగ్ అక్షరాలా నిజం. మనం గతాన్ని మార్చలేం.. కాలప్రవాహాన్ని ఆపలేం.. చేయాల్సిందల్లా అంతా మనమంచికే అని భావించడమే.

గతం మర్చిపోవడం

జరిగిన చెడును మర్చిపోయి ముందుకు సాగడమే మన ఆరోగ్యానికి మందు అని నిపుణులు అంటున్నారు.

లవర్ బ్రేకప్ చెప్పిందని. నిరాశ చెందడం కంటే మీకు నచ్చిన పనిని హాబిగా అలవాటు చేసుకోండి. పుస్తకాలు చదవడం, కుకింగ్, బొమ్మలు వేయడం లాంటి అలవాట్లతో మీ బాధ దూరం అవ్వడం ఖాయం.

నచ్చిన పనిని చేయడం

చాలా మంది తమలో ఉన్న భావాలను, ఎమోషన్స్ ను దాచుకుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నది నిపుణుల వాదన. 

ఎమోషన్స్ ను బయటపెట్టండి

అందుకే మీకు ఏడవాలి అనిపిస్తే ఏడవండి.. నవ్వాలనిపిస్తే నవ్వండి.. అంతే!

ఒక్క సారి మీ నుంచి ఏదైనా జారిపోయాక మీరు దాని గురించి నెగటివ్ గా ఆలోచించకండి. 

నెగిటివిటీ

అలా వస్తువైనా.. మనిషైనా మీరు చేబట్టే దూరం అయ్యారన్న ఆలోచన మీ మనసులోకి అస్సలే రానివ్వకండి.

ఒక్కసారి దూరం అయ్యాక.. మీరు మళ్లీ వారికి కనిపిస్తే.. పదే పదే  బాధపడాల్సివస్తుంది. కాబట్టి వీలైనన్ని రోజులు వారికి కనబడకుండా ఉంటేనే మీకు మంచిది

వీలైనంత వరకు వారికి కనిపించకండి