మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు కరివేపాకులో ఉన్నాయి.
కానీ చాలా మంది కూరలో కరివేపాకును దేనికీ పనికిరాదన్నట్టు పక్కన
పెట్టేస్తుంటారు.
అయితే కరివేపాకు వలన కలిగే లాభాలు తెలిస్తే మాత్రం అసలు వదలరు.
కరివేపాకు వలన కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
కరివేపాకు మన బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తూ, వ్యర్ధాన్ని బయటకి పంపిస్తుంది.
కరివేపాకు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
కరివేపాకును తినడం వల్ల బ్లాడర్, యూరిన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
కరివేపాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి.
ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి సహాయపడే అనేక కారకాలు కరివేపాకులో ఉంటాయి
కరివేపాకులో విటమిన్ సి, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నికోటినిక్ యాసిడ్ లు పుష్క
లంగా ఉంటాయి.
కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టును ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి సహాయప
డతాయి.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలే కాదు ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది.
ఇవి జుట్టు రాలడాన్ని ఆపి... గట్టిగా ఉండేందు చేయడానికి కూడా సహాయపడతాయి.
ఇలా కరివేపాకు వలన ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.