సినిమా డైరెక్టర్ కావడం చాలామంది డ్రీమ్. దాన్ని ఎంతోమంది సద్వినియోగం చేసుకుని స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు. 

ఇప్పుడున్న రాజమౌళి, సుకుమార్,  కొరటాల శివనే దానికి సరైన ఉదాహరణలు.

ఇదే టైమ్ లో కొందరు దర్శకులు మాత్రం బంగారం లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వాళ్ల గురించి ఈస్టోరీ

శర్వానంద్ తో 'శ్రీకారం' తీసిన డైరెక్టర్ బి.కిశోర్ హిట్ కొట్టలేక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

గీతా ఆర్ట్స్ లో 'చావు కబురు చల్లగా' తీసిన కౌశిక్.. మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నారు.

విజయ్ తో 'డియర్ కామ్రేడ్' తీసిన భరత్ కమ్మ.. అది ప్లాఫ్ కావడంతో మరో అవకాశం దక్కించుకోలేకపోతున్నారు.

నాగ్ 'వైల్డ్ డాగ్'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అహిషోర్ సల్మాన్.. కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు.

విశ్వక్ సేన్ 'పాగల్'తో ప్లాఫ్ అందుకున్న  నరేశ్ కుప్పిలి.. రెండో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ చేసుకున్నారు.

'వరుడు కావలెను' తీసిన లక్ష్మీ సౌజన్య..  ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.

వరుణ్ తేజ్ హీరో, అల్లు బాబీ నిర్మాతతో 'గని' తీసిన కిరణ్ కొర్రపాటి.. గోల్డెన్ ఛాన్స్ ని వృధా చేసుకున్నారు.

రాజ్ తరుణ్ తో తీసిన 'స్టాండప్ రాహుల్' సినిమా ఫెయిలైంది. క్రేజీ ప్రాజెక్టే కానీ డైరెక్టర్ సాంటోకి కలిసిరాలేదు.

రవితేజ హీరోగా తొలి సినిమా చేసిన  శరత్ మండవ.. 'రామారావ్ ఆన్ డ్యూటీ'తో పూర్తిగా నిరాశపరిచారు.

నితిన్ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం' తీసిన రాజశేఖర్ రెడ్డి.. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు.