మొత్తం ఛార్జింగ్ అయిపోయే వరకూ వాహనాన్ని వాడకూడదు.
ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేసిన వెంటనే ఛార్జింగ్ పె
ట్టకూడదు.
కంపెనీ కండిషన్స్ బట్టి కనీసం 15 నుంచి 60 నిమిషాల గ్యాప్ ఇవ
్వాలి.
బండి వాడిన వెంటనే లేదా బ్యాటరీ ఛార్జింగ్ పూర్తయిన వెంటనే బ్యాటరీ
నుంచి ప్లగ్ ని తీయకూడదు. కనీసం 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండాలి.
వాహనం నడిపేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కి ఉంటుంది. హీట్ తగ్గిన తర్వాత ఛార్జింగ్ పెడితే మంచిది.
ఎలక్ట్రిక్ వాహనం మీద బయటకు వెళ్లొచ్చిన అరగంట, గంట తర్వాత ఛార్జింగ్ పెడితే పేలుళ్లు సంభవించే అవకాశాలు తక్కువ.
బీఎంఎస్ (బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం) సరిగా పని చేయకపోతే 90 - 100 డిగ్రీల హీట్ ఎక్కినా తెలియదు.
ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో బ్యాటరీని ఉంచకూడదు, ఛార్జింగ్ పెట్టకూడదు.
ఎండలో కాకుండా నీడ ఉన్న ప్రాంతంలో వెహికల్ ని పార్క్ చేయాలి.
చుట్టూ మండే స్వభావం ఉన్న వస్తువులు లేకుండా చూసుకోవాలి.
బ్యాటరీలో వైరింగ్ లోపాలు ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలే ప్రమాదం ఉంది. వైరింగ్ లోపాలు లేకుండా చూసుకోవాలి.
వాడకుండా కొన్ని రోజులు ఉంచినట్లయితే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. కాబట్టి బ్యాటరీ ఖచ్చితంగా 20 - 80% ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి.
బ్యాటరీని 100% ఛార్జ్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాటరీకి సూటయ్యే ఒరిజినల్ ఛార్జర్ ని మాత్రమే వాడాలి.
ఛార్జింగ్ అలానే పెట్టి వదిలేయకూడదు. ఛార్జింగ్ ఫుల్ అయిన వెంటనే ప్లగ్ ని తీసేయాలి.