సంసారం అన్నాక సవాలక్ష ఒత్తిడులు ఉంటాయి.

దాంతో సహజంగానే భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.

అయితే మీరు వాగ్వాదం చేసుకునే టైమ్ లో మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారా?

అలా అయితే మీరు మీ పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్నట్లే.. అంటున్నారు నిపుణులు.

మీరు పిల్లల ముందు గొడవ పడితే ఆ గొడవ తాలుకు ప్రభావం పిల్లలపై పడి భవిష్యత్తులో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

ఇక పిల్లల ముందు మీరు చేయకూడనీ, చేయాల్సిన విషయాలను తెలుసుకుందాం.

మీరు పిల్లల ముందు గట్టిగా అరవడంతో వారు భయపడిపోతారు. దాంతో నిద్రలో కూడా వారు ఆ గొడవనే తలుచుకునే ప్రమాదం ఉంది. అందుకే వారున్నప్పుడు గట్టిగా అరవకండి.

వాగ్వాదం ఎక్కువైతే ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గండి తప్పులేదు. అలా కాకుండా చేయి చేసుకోవడం లాంటివి పిల్లల ముందు చేస్తే వారి మనసులో అవి బలంగా నాటుకు పోతాయి.

పిల్లల పెంపకంలో ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి. అప్పుడే వారికి మీ మీద ప్రేమపెరుగుతుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భార్య, భర్తల మధ్య గొడవ జరిగాక.. పిల్లల్ని నీకు అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అని అడుగుతారు.

ఈ ప్రశ్న పిల్లలపై విపరీతమైన ఒత్తిడి తెస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారి మానసిక ప్రవర్తన కూడా మారే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు

అలాగే మీరెప్పుడైనా గొడవ పడాల్సివస్తే.. లేదా గొడవ పడితే అది మీ పర్సనల్ గది దాటి బయటకు రాకుడదు. దాంతో మీ పిల్లలకు మీపై ప్రేమ, అభిమానం పెరుగుతాయి.