సాధారణంగా మనం ఏదైన కష్టమైన పని చేస్తేనే ఒళ్లు నొప్పులు వస్తాయి.

ఐతే మీరు ఏ పని చేయక పోయినా ఒళ్లు నొప్పులకు గురి అవుతున్నారు అంటే ఏదో సమస్య ఉన్నట్లే లెక్క.. అంటున్నారు డాక్టర్లు.

ఒళ్లు నొప్పులుగా ఉంటే ఏ పని చేయాలన్నా శరీరం సహకరించదు.

మరి ఈ ఒళ్లు నొప్పులు ఎందుకు వస్తాయో నిపుణులు వివరించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేకపోవడం శరీరానికి తగినంతగా నిద్ర లేకపోతే బాడీ వీక్ అవుతుంది. దీంతో ఒళ్లు నొప్పులు వస్తాయని వైద్యలు చెబుతున్నారు.

డీహైడ్రేషన్ శరీరానికి తగినంతగా నీరు అందివ్వాలి. బాడీకి కావాల్సిన నీరు ఇవ్వకపోతే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. ఇదీ ఒక విధంగా నొప్పులకు దారి తీస్తుంది.

ఒత్తిడి మనిషికి ఒత్తిడి ఎక్కువైతే అలసట అనిపిస్తుంది. దాంతో శరీరంలో మార్పులు జరిగి బలహీనంగా మారిపోతారు. 

తద్వారా బాడీ పెయిన్స్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఐరన్ లోపం ఐరన్.. రక్తంలో ఉంటే ప్రధాన మూలకం. ఇది తక్కువ అయితే బాడీకి అందవలసిన ఆక్సిజన్ అందక నోప్పులు వస్తాయి.

విటమిన్-డి శరీరానికి విటమిన్లు చాలా అవసరం. వాటిల్లో విటమిన్ డి ముఖ్యమైనది. ఇది ఎముకలను దంతాలను గట్టిగి ఉంచడానికి ఉపయోగపడుతుంది. 

ఇది లోపిస్తే ఒళ్లు నొప్పులు త్వరగా వస్తాయంటున్నారు వైద్యులు.

ఆర్థరైటిస్ కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్ ఉంటే సాధారణంగానే బాడీ నొప్పులకు గురవుతుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి