అయితే కొంతమందికి ఇప్పుడు కొబ్బరి నూనె నచ్చకపోవచ్చు. కానీ కొబ్బరి నూనె వల్ల గడ్డం ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
తరచూ బాదం నూనెను గడ్డానికి ఉపయోగిస్తే గడ్డం సహజంగా ఒత్తుగా పెరుగుతుంది.
టీ ట్రీ ఆయిల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ కారణంగా గడ్డం అందంగా పెరగడానికి ఉపయోగపడతాయి.
లావెండర్ ఆయిల్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. గడ్డం కూడా పెరిగేందుకు ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది.
రోజ్ మేరీ ఆయిల్ జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. గడ్డం బాగా అందంగా పెరగాలంటే రోజ్ మేరీ ఆయిల్ ఉత్తమం.
ఆలివ్ నూనె కూడా గడ్డం మీద జుట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఆమ్లాలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.