చాలా మందికి ఆకుపచ్చ రంగులో ఉండే జామకాయల గురించి మాత్రమే తెలుసు.

కానీ నల్ల జామకాయల గురించి ఎప్పుడూ విని ఉండరు. 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే నల్ల జామకాయల వల్ల.. ఆకుపచ్చ జామకాయలతో పోలిస్తే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఆకుపచ్చ జామకాయలతో పోలిస్తే ఈ నల్ల జామకాయల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.

నల్ల జామకాయలు పైకి నలుపు రంగులో ఉంది.. లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది.

నల్ల జామకాయల్లో ఖనిజాలు, విటమిన్స్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

నల్ల జామకాయలు తినడం వల్ల శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది.

నల్ల జామకాయలు తింటే రక్త శాతం వృద్ధి చెందుతుంది.

నల్ల జామకాయల వల్ల రక్తహీనత సమస్య షెడ్ కెళ్ళిపోతుంది.

నల్ల జామకాయలు తినడం వల్ల చర్మం మీద ముడతలు తొలగిపోతాయి. 

నల్ల జామకాయలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

నల్ల జామకాయలు తింటే మలబద్ధకం దరి చేరదు. ఈ జామకాయలు తినడం ద్వారా పైల్స్ సమస్యను నివారించవచ్చు.  

జామకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

వానాకాలంలో వచ్చే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సీజనల్ వ్యాధుల నుండి నల్ల జామకాయలు కాపాడతాయి.