ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుకు ఆరేడు కప్పులు టీ తాగేవాళ్లు చాలామంది. 

దీనివల్ల ఏం జరుగుతుందో తెలిస్తే.. మీరు టీ జోలికే అస్సలు వెళ్లరు. ఇంతకీ ఏంటి విషయం?

టీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

కప్ టీలో 60 గ్రాముల కెఫిన్ ఉంటుంది. 3 కప్పుల కంటే ఎక్కువ తాగితే మీకు ప్రమాదమే.

ఒకేవేళ ఎక్కువ కప్పుల టీ తాగితే శరీరంలోని టానిన్లు ఇనుము శోషణ సామర్థాన్ని తగ్గిస్తాయి.

టీలో కెఫిన్ కంటెంట్ మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది. మైకం కమ్ముకుంటుంది.

రోజుకు 5-10 కప్పుల టీ తాగితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య దారుణంగా పెరిగిపోతుంది.

అందుకే టీ మోతాదులో తాగండి లేదంటే పూర్తిగా మానుకోండి.

టీ తాగడం వల్ల రిఫ్రెష్ అవుతారేమో కానీ రోజూ తాగితే నిద్రలేమి సమస్య రావొచ్చు.

టీ ఎక్కువగా తాగితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

టీ మోతాదుకు మించి తాగితే బరువు కూడా పెరగడం, రోగ నిరోధక శక్తి తగ్గే ఛాన్సుంది.

గొంతు క్యాన్సర్ కి వేడి టీ తాగడమే కారణమని నిపుణులు అంటున్నారు.

ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నవాళ్లు టీ తాగకపోవడమే మంచిది.

ఒకవేళ తాగాలనుకుంటే నార్మల్ టీ బదులు లెమన్ టీ తాగటం శ్రేయస్కరం.