బాలీవుడ్ స్టార్స్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ అడ్వంచర్ ఫాంటసీ మూవీలో.. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు.
బాలీవుడ్ స్టార్స్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ అడ్వంచర్ ఫాంటసీ మూవీలో.. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు.
ముందునుండి చెప్పినట్లుగానే సకల దేవతలు ధరించిన అస్త్రాల గురించి చర్చిస్తూ.. అస్త్రావర్స్ ని చూపించనున్నట్లు ట్రైలర్ లోనే చూపించారు.
అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనిరాయ్ లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ మూవీపై బాలీవుడ్ ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది.
కథ
ఈ లోకంలోని సకల దేవతాస్త్రాలను శాసించే బ్రహ్మదేవ్ అస్త్రం చుట్టూ తిరుగుతుంది. పూర్వం ఎందరో మహాఋషులు హిమాలయాలలో కఠోర తపస్సుతో ఆ బ్రహ్మదేవుని వరం పొందుతారు.
కథ
ఈ సృష్టిని కాపాడేందుకు సకల దేవతాస్త్రాలను బ్రహ్మదేవుని వరంతో ఒక్కొక్కరుగా ఒక్కో అస్త్రాన్ని ధరించి ‘బ్రహ్మంష్’ అనే కూటమిగా ఏర్పడతారు.
కథ
అలా ఎన్నో యుగాలుగా ఆయా అస్త్రాల శక్తితో లోకాన్ని కాపాడుతుంటారు. ఈ క్రమంలో యుగాలతో పాటు తరాలు అంతరించిపోతున్నా..
కథ
బ్రహ్మంష్ కూటమి ఎప్పటికప్పుడు ఆ బ్రహ్మస్త్రాన్ని సేవ్ చేస్తుంటారు.
కథ
ఇక శివ(రణబీర్ కపూర్)లో అనాధ. డీజేగా పనిచేసుకుంటూ బ్రతికేస్తుంటాడు. ఓ ఫెస్టివల్ లో శివకు ఇషా(అలియా భట్)ను చూసి ప్రేమలో పడతాడు.
కథ
యితే.. శివకి తెలియదు తనలో అగ్ని అస్త్రం దాగుందని.. కానీ, అతనికి ఈ సకల అస్త్రాలకు సంబంధించి కలలు వస్తుంటాయి.
కథ
ఈ క్రమంలో దేవతాస్త్రాలు ధరించిన వారిని చంపేస్తూ, బ్రహ్మస్త్రాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంటుంది జునూన్(మౌనిరాయ్).
కథ
దీంతో బ్రహ్మంష్ లో కలవరం మొదలవుతుంది. మరి బ్రహ్మాస్త్రంకి, శివకి సంబంధం ఏంటి? సకల దేవతాస్త్రాల గురించి ఎలా తెలుసుకున్నాడు?
కథ
మూడు భాగాలుగా విడిపోయిన బ్రహ్మాస్త్రం కలిస్తే ఏమవుతుంది? శివ, ఇషాల ప్రేమ ఎంతవరకు వచ్చింది? అసలు శివ ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.
ఇక శివ క్యారెక్టర్ లో రణబీర్ కపూర్ జీవించేశాడు. ఇషాగా అలియా భట్ అదరగొట్టింది.
బ్రహ్మాస్త్రం మూవీతో వీరిద్దరికీ తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నంది అస్త్రంతో నాగార్జున, వానర అస్త్రంతో షారుఖ్ ఖాన్ క్యారెక్టర్స్ థ్రిల్ కి గురిచేస్తాయి.
ఈ సినిమాలో అమితాబ్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభాస్త్రం ధరించిన గురువు క్యారెక్టర్ లో అదరగొట్టేసారు.
విలన్ గా మౌని రాయ్ మెప్పిస్తుంది. ఓరల్ బ్రహ్మాస్త్రంలోని అన్నీ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. అయితే.. క్లైమాక్స్ లో శివ తండ్రి గురించి ఇచ్చే ట్విస్టు మైండ్ బ్లాక్ చేస్తుంది.
బ్రహ్మాస్త్రం మూవీకి మెయిన్ ఎస్సెట్ స్టోరీ, స్క్రీన్ ప్లేలతో పాటు సంగీతం, సినిమాటోగ్రఫీ.
ప్రీతమ్ సాంగ్స్ తో పాటు సైమన్ ఫ్రాంగ్లేన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తో పాటు ఎమోషనల్ గా టచ్ చేస్తాయి.
దర్శకుడు అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మొదటి అడుగు సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు.