బంగాళాదుంప.. ఇందులో పోషకాలు అధికంగా ఉండడంతో ప్రతీ ఒక్కరు తీసుకునే ఆహారంలో ఉండే విధంగా చూసుకుంటుంటారు.

ఈ బంగాళాదుం ఫ్రై చేసుకోవడమే కాకుండా చిప్స్ వంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు. అందుకే వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంటుంది.

మాములుగా ప్రతీ ఇళ్లల్లో బంగాళాదుంపలను కట్ చేసి ఆ తర్వాత వాటికి ఉన్న తోక్కలను పడేస్తూ ఉంటారు.

బంగాళాదుంప తొక్కలను చెత్త బుట్టలో పడేయకుండా వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

బంగాళాదుంప తొక్కల వల్ల ఉపయోగాలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? 

బంగాళాదుంప తొక్కలో ఐరన్ తో పాటు పొటాషియం కూడా పుష్కలంగా దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

గాయాలు, పుండ్లు అయిన చోట బంగాళాదుంపను పేస్ట్ లా చేసి రాస్తే అవి పూర్తిగా నయమవుతాయట. 

హార్ట్ పేషెంట్స్ సైతం ఈ తొక్కలను తినడం ద్వారా ఎంతో ప్రయెజనం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

క్యాన్సర్ తో బాధపడే వారు సైతం వీటిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తుంది.

ఆలూ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ప్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ బంగాళాదుంప తొక్కలను తీసుకోవడం ద్వారా ఎముకలు సైతం గట్టి పడతాయట.

ఇక నుంచైన బంగాళాదుంప తొక్కను తొక్కే కదా అని తీసి పారేయకుండా ఆహారంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ బంగాళాదుంప తొక్కలను పారేయకుండా ఇలా ట్రై చేసి చూడండి.